- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా దేశం వదిలి వెళ్లిపోండి.. భారతీయులపై బూతులతో రెచ్చిపోయిన అమెరికన్
విదేశాల్లో భారతీయులపై దాడులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ అమెరికన్ భారతీయులను తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో అమెరికన్ భారతీయులను మీకు అమెరికా అంటే ఇష్టమా అని అడిగాడు.

దిశ, వెబ్ డెస్క్: విదేశాల్లో భారతీయులపై దాడులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ అమెరికన్ భారతీయులను తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో అమెరికన్ భారతీయులను మీకు అమెరికా అంటే ఇష్టమా అని అడిగాడు. దానికి అక్కడ ఉన్న భారతీయ జంట అవును ఇష్టమేనని అన్నారు. దీంతో ఏది బెటర్ అమెరికానా ఇండియానా అని మళ్లీ ప్రశ్నించాడు. రెండు కూడా ఇష్టమేనని వాళ్లు సమాధానం ఇచ్చారు. దీంతో అతడు ఇండియా విశ్వసనీయత కలిగిన దేశం అని అమెరికాలో ఎందుకు ఉంటున్నారని అన్నాడు.
ప్రపంచాన్ని ఎక్స్ ప్లోర్ చేస్తున్నామని భారతీయులు చెప్పగా.. మీరు ఇక్కడ ఉండటం మాకు ఇష్టం లేదు అంటూ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు భారతీయ జంటనే తప్పు పడుతున్నారు. డాలర్ల వేటకోసం వెళ్లి పరువు తీసుకుంటున్నారని అంటున్నారు. ఏదైనా ఉద్యోగం చేసుకుని ఇక్కడే బతకాలి కానీ విదేశాలకు వెళ్లి మాటలు పడటం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు అక్కడకు వెళ్లి సినిమాల సెలబ్రేషన్స్, పండుగలు చేసుకోవడం, వీధుల్లో ఊరేగింపులతో అతి చేస్తున్నారని మండిపడుతున్నారు.






