- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొన్ని అంశాల్లో సవరణ సులభం.. కొన్ని అంశాల్లో కఠినం : చీఫ్ జస్టిస్
రాజ్యాంగ సవరణ కొన్ని అంశాల్లో సులభం.. కొన్ని అంశాల్లో చాలా కఠినం అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాజ్యాంగ సవరణ కొన్ని అంశాల్లో సులభం.. కొన్ని అంశాల్లో చాలా కఠినం అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళగిరిలో నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరై ప్రసంగించారు.
ప్రతి న్యాయవాది కంఠస్థం చేసుకోవాలి
ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే పౌరులు కోర్టులను ఆశ్రయించే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. సాంఘిక, ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు పొందుపరచబడ్డాయన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రసంగించారన్నారు. ఆ ప్రసంగం ప్రతి న్యాయవాదికి కంఠస్థం కావాలన్నారు. రాజ్యాంగాన్ని కాలానుగుణంగా మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. అంశం ప్రాధాన్యం బట్టి సవరణ చేసేందుకు విధానాలను పొందుపరిచారని పేర్కొన్నారు.
ఆదేశిక సూత్రాలకూ తగిన ప్రాధాన్యం
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఏడాది తరువాత రిజర్వేషన్లపై మొదటి సవరణ జరిగిందన్నారు. రాజ్యాంగ సవరణ విషయమై కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు తొలుత ఘర్షణ వాతావరణం ఏర్పడిందని గుర్తు చేశారు. కేశావానంద భారతి కేసులో రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని సవరించరాదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. 1975 వరకు ప్రాథమిక హక్కులకే అధిక ప్రాధాన్యం ఉండేదన్నారు. కేశవానంద భారతి కేసు తరువాత ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలకూ తగిన ప్రాధాన్యం దక్కిందన్నారు.
క్రిమీలేయర్ విధానం ఉండాలి
గతేడాది ఏడుగురు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో కూడా క్రిమీలేయర్ విధానం ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలని తెలిపారు.






