ఇవాళే అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ప్రారంభించనున్న సీఎం జగన్

by Kema Shiva Kumar |

విజయవాడ వేదికగా ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తైన డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేడు జరగనుంది.

ఇవాళే అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ప్రారంభించనున్న సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్:విజయవాడ వేదికగా ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తైన డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేడు జరగనుంది. ఈ మేరకు సీఎం జగన్ తన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దాదాపు 18 ఎకరాల స్థలంలో 125 అడుగల ఎత్తుతో రూ.404 కోట్ల నిధులతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. విగ్రహం తయారికి దాదాపు 400 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను వినియోగించారు. అదేవిధంగా విగ్రహ పరిసర ప్రాంతంలో స్మృతి‌వనాన్ని ఏర్పాటు చేసి అందులో అంబేద్కర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, రెండు వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే, నేటి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి లక్షల్లో జన తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Next Story