- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోనసీమ జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా తెలిపారు...

దిశ, అమలాపురం: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. రామచంద్రాపురం, మలికిపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనాల కేసులను ఛేదించినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.గత నెల 24వ తేదీన రామచంద్రాపురం టౌన్, రైస్ పేటలో జరిగిన దొంగతనంపై నమోదైన కేసునుకు సంబంధించి పాత నేరస్థుడైన ఏ1 ఖండవల్లి సీతారాముడు (48)ను రామచంద్రాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అరెస్ట్ చేశామని, రూ. 13.20 లక్షల విలువైన 9.4 తులాల (109.604 గ్రాములు) బంగారు ఆభరణాలను రికవరీ చేశామని చెప్పారు. నిందితుడిపై గతంలో భీమవరం, గణపవరం పరిధిలో కూడా పలు కేసులు ఉన్నాయన్నారు.మలికిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడిన ఏ1-కట్టా అర్జున్ (26) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని, ఇతనిపై కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు 18 కి పైగా దొంగతనాల కేసులు ఉన్నాయని వెల్లడించారు.
ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఏ 2-మండేల నాగ భాస్కర్ రావు, ఏ3-కర్రి రాము లు ప్రస్తుతం పరారీలో ఉన్నారన్నారు. నిందితుడి నుండి సుమారు రూ. 1,79,220 విలువ చేసే 618 గ్రాములు వెండిని స్వాధీనం చేసుకున్నామని, ఈ రెండు కేసుల్లో సుమారు రూ. 30,36,220 సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులను ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులను ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు. సమావేశంలో అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు టీ ఎస్ ఆర్కే ప్రసాద్, సుంకర మురళీ మోహన్ తదితర అధికారులు పాల్గొన్నారు.






