Ambati Rayudu: జట్టు మారిన అంబటి రాయుడు.. ఆ పార్టీ అధినేతకు మద్దతు

by Disha Web Desk 3 |
Ambati Rayudu: జట్టు మారిన అంబటి రాయుడు.. ఆ పార్టీ అధినేతకు మద్దతు
X

దిశ వెబ్ డెస్క్: ప్రముఖ ఇండియన్ క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు రాజకీయాల్లోనూ చక్కని ఆటను కనబరుస్తున్నారు. గతంలో వైసీపీలో అంబటి రాయుడు చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వన్ డే మ్యాచ్‌లా, అంబటి రాయుడు పార్టీలో చేరిన కొన్ని రోజుల్లోనే పార్టీకి రాజీనామా చేశారు. అయితే మార్చి 27వ తేదీన ట్విట్టర్‌లో సిద్ధం అని ట్వీట్ చేశారు.

వైసీపీ సిద్ధం పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో అంబటి రాయుడు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తిరిగి అయన యూటర్న్ తీసుకోనున్నారు అనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆటలో గెలుపోటములను అంచనా వేయగల అంబటి రాయుడు చాకచక్యంగా రాజకీయం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎటు తేల్చుకోలేక అయోమయంలో ఉన్న రాయుడు రాత్రి ఓ నిర్ణయానికి వచ్చారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది అని అనుకున్నారేమో జగన్ జట్టు కట్ చేశారు. జనసేనాని పవన్ కు మద్దతిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పవన్ అన్నను సీఎం చెయ్యడానికి సిద్ధం.. కలిసి సాధిద్దాం. అని పోస్ట్ చేశారు. గతంలో ట్విట్టర్‌లో సిద్ధం అని పోస్ట్ చేసిన అంబటి రాయుడు, ఇప్పుడు పవన్‌ను సీఎం చెయ్యడానికి సిద్ధం అంటూ గతంలో చేసిన సిద్ధం పోస్ట్‌ను కవర్ చెయ్యడానికి ప్రయత్నించారు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed