- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YCP: అంబటికి ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించాలి: డీజీపీకి వైసీపీ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగిన విషయం తెలిసిందే. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ శనివారం గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి ఇంటిని ముట్టడించి.. కారు, ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ దాడిని వైసీపీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే ఘటనపై డీజీపీ వైసీపీ లేఖ రాసింది. గుంటూరులో పరిస్థితి చేయి దాటిపోతోందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిందని, ఆయనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేసింది. అంబటికి వెంటనే కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాలని కోరింది. సంఘ విద్రోహ శక్తులు అంబటి ఇంటిపై దాడి చేశాయని పేర్కొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డీజీపీ లేఖ ద్వారా మెయిల్ చేశారు. అలాగే చీఫ్ సెక్రటరీ, డీజీపీకి ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదని పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.






