- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరులో పోలీసులు వర్సెస్ అంబటి
by Ajay Maddhiboyina |
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ సీఐ వెంకటేశ్వర్లు అన్నట్టుగా ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ సీఐ వెంకటేశ్వర్లు అన్నట్టుగా ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు కలక్టరేట్ వద్దకు వెళుతుండగా టీజేపీఎస్ కాలేజీ వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎందుకు అడ్డుకుంటున్నారు అని అంబటి ప్రశ్నించగా సీఐ వెంకటేశ్వర్లుతో ఆయనకు గొడవ జరిగింది.
ఇద్దరూ ఒకరిపైకి ఒకరు వెళ్లారు. నేనేంటో చూపిస్తానంటూ అంబటి రాంబాబు అనగా సీఐ ఏంటి నువ్వు చూపించేది బొంగు చూపిస్తావా అంటూ రెచ్చిపోయారు. మర్యాదగా మాట్లాడాలని అన్నారు. ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ఇద్దరూ కొట్టుకునే వరకు గొడవ చేరుకుంది. పక్కనే ఉన్న పోలీసులు ఇద్దరికి నచ్చజెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అంబటిని అక్కడ నుండి పంపించారు.
Next Story






