- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైల్లో స్లీప్ అప్నియా పరికరంతో నిద్రిస్తున్న అంబటి .. అసలు స్లీప్ అప్నియా అంటే ఏంటి?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. దీంతో పాటు ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయి. ఇక పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో అంబటి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనకు శ్వాస సంబంధిత సమస్యలు ఉండటంతో కోర్టు అనుమతి ద్వారా స్లీప్ అప్నియా పరికరాన్ని ఉపయోగిస్తున్నారు.
శ్వాస సంబంధిత సమస్య ఉన్నవాళ్లు నిద్రిస్తున్న సమయంలో ఒక్కోసారి శ్వాస సరిగ్గా రాక ఇబ్బంది పడతారు. శ్వాస తీసుకునే సమయంలో ఎక్కువ గ్యాప్ వస్తుంది. అయితే అలాంటి సమయంలో ఆక్సీజన్ పడిపోతే ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది. అలా ఆక్సీజన్ శాతం పడిపోకుండా స్లీప్ అప్నియా పరికరం ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యలో నిద్రలో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నిద్రపోయే ముందే పరికరాన్ని అమర్చుతారు. ఇక అంబటికి సైతం ఆ సమస్య ఉండటంతో మెషిన్ అమర్చారు.






