పీటీ వారెంట్.. రాజమండ్రి నుంచి గుంటూరుకు అంబటి తరలింపు

by Naga Rani Yarlagadda |

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో గత వారం అరెస్టైన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు.

పీటీ వారెంట్.. రాజమండ్రి నుంచి గుంటూరుకు అంబటి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో గత వారం అరెస్టైన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ.. గతేడాది నవంబర్ 12న చేసిన ధర్నాలో బారికేడ్లను తోసుకుంటూ.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయింది. ఈ కేసులో అంబటి రాంబాబును విచారించేందుకు పట్టాభిపురం పీఎస్ పోలీసులు నిన్న పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గుంటూరు కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. అలాగే సీఎంపై వ్యాఖ్యల కేసులో గుంటూరు కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. దానిపై కూడా నేడు విచారణ జరగనుంది. మరోవైపు అంబటి పోలీస్ కస్టడీ పిటిషన్, రాజమండ్రి జైల్లో అదనపు సౌకర్యాల కోసం వేసిన పిటిషన్లపై కూడా కోర్టు విచారణ చేపట్టనుంది. నాలుగు పిటిషన్ల విచారణ ఉండటంతో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నఅంబటి రాంబాబును గుంటూరుకు తరలిస్తున్నారు.

Next Story