'తొక్కండి సైకిల్‌ని' అంటూ అంబటి సెటైరికల్ పోస్ట్ !

by velandi.Saikiran |   (  Updated:2026-04-27 18:57:17  IST  )

ఏపీలో పెట్రోల్, డీజిల్ లేదని.. ఇకపై తొక్కండి సైకిల్ ని అంటూ కూటమి సర్కార్ ను విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు అంబటి.

తొక్కండి సైకిల్‌ని అంటూ అంబటి సెటైరికల్ పోస్ట్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ లేదని.. ఇకపై తొక్కండి సైకిల్ ని అంటూ కూటమి సర్కార్ ను విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ను ట్యాగ్ కూడా చేశారు. దీంతో క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

అయితే దీనిపై పలుగురు టీడీపీ మద్దతు దారులు కౌంటర్ ఇస్తున్నారు. చమురు కొరత దేశ వ్యాప్తంగా ఉందని.. కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహన దారులకు ఎలాంటి సమస్యలు రాకుండా కూటమి సర్కార్ చూస్తోందని వ్యాఖ్యానించారు. దీంతో అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వివాదంగా మారింది.

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్

రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరత సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా దృష్టి సారించారు. ఇందన‌ కొరతతో వాహనదారులు, అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై ఆయన స్పందించడంతో అధికారులు అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

Next Story