- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ స్కామ్ ఓ కల్పిత కేసు.. ఆ వీడియోనే అంతా చెప్తోంది : అంబటి రాంబాబు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case) ఓ కట్టుకథ అని, ఇదంతా పూర్తిగా కల్పితమని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu).

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case) ఓ కట్టుకథ అని, ఇదంతా పూర్తిగా కల్పితమని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu). జగన్, వైసీపీ (YSRCP) ఇమేజ్ ను దెబ్బతీసేందుకు, పార్టీ నాయకుల్ని వేధించేందుకే ఈ కేసును సృష్టించారని విమర్శించారు. నిన్న చెవిరెడ్డి అనుచరుడు ఉన్న వీడియో బయటికి రావడంపై ఆయన స్పందించారు. ఆ వీడియో కూడా అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంలో భాగమేనన్నారు అంబటి రాంబాబు.
వీడియోలో కనిపిస్తోన్న రూ.2000 నోట్ల కట్టలే ప్రభుత్వ కుట్రకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికలు 2024 మే నెలలో జరిగితే.. రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) 2023 మే నాటికే 2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. సిట్ బయటపెట్టిన వీడియోలో అన్నీ రూ.2000 నోట్ల కట్టలే కనిపిస్తున్నాయని, దీనిని బట్టి చెవిరెడ్డిపై చేసిన ఆరోపణలు అబద్ధమని తెలుస్తోందన్నారు.
నిజానికి లిక్కర్ స్కామ్ కేసులో సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం గాలి మాటలు చెప్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో భాగంగా సీజ్ చేసిన రూ.11 కోట్ల నగదు విషయంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం చేసిన కుట్ర బయటపడిందన్నారు. ఒక తప్పుని దాచేందుకు కూటమి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని, అక్రమ అరెస్టులు, ప్రచారాలతో రాజకీయ లబ్ధిపొందాలని చూస్తోందని దుయ్యబట్టారు.






