వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

by Ajay Maddhiboyina |

వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు నేడు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. బుధ‌వారం బెయిల్ పై బ‌ట‌య‌కు వ‌చ్చిన అంబ‌టి ఈరోజు జ‌గ‌న్ నివాసానికి వెళ్లి ఆయ‌న‌ను క‌లుసుకున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు
X

దిశ‌, వెబ్ డెస్క్: వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు నేడు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. బుధ‌వారం బెయిల్ పై బ‌ట‌య‌కు వ‌చ్చిన అంబ‌టి ఈరోజు జ‌గ‌న్ నివాసానికి వెళ్లి ఆయ‌న‌ను క‌లుసుకున్నారు. త‌న ఇంటిపై జ‌రిగిన దాడి, అక్ర‌మ కేసులు, పోలీసుల వైఖ‌రి లాంటి అంశాల‌ను జ‌గ‌న్‌కు వివ‌రించారు. అంబ‌టి రాంబాబు వెంట వైసీపీ కీల‌క నేత‌లు సైతం ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అంబటి రాంబాబు సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా జైలు నుండి విడుదలై బయటకు వచ్చారు. అంబటి జైలులో ఉన్న సమయంలో జగన్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఇప్పుడు జైలు నుండి విడుదలవ్వడంతో అంబటి జగన్ తో సమావేశమై ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు.

Next Story