- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మఫ్టీలో వచ్చి ఎత్తుకెళ్తున్నారు: పోలీసులపై అంబటి సంచలన ఆరోపణలు
మఫ్టీలో వచ్చి మనుషులను ఎత్తుకెళ్తున్నారని పోలీసులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ కేడర్‌ను అణగదొక్కాలనే లక్ష్యంగా పోలీసులు సంఘ విద్రోహ శక్తుల్లా వ్యవహరిస్తున్నాని ఆయన వ్యాఖ్యానించారు. ..

దిశ, వెబ్ డెస్క్: మఫ్టీలో వచ్చి మనుషులను ఎత్తుకెళ్తున్నారని పోలీసులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Amabti Rambabu) సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ(Ycp) కేడర్‌ను అణగదొక్కాలనే లక్ష్యంగా పోలీసులు సంఘ విద్రోహ శక్తుల్లా వ్యవహరిస్తున్నాని ఆయన వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి(Former Deputy CM Narayana)ని ఆయన కలిసిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని తిరుపతి మండలానికి చెందిన సర్పంజరి తంబిరెడ్డిని కిడ్నాప్ చేసి మూడు రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారని అంబటి ఆరోపించారు. రెండు రోజుల పాటు తంబిరెడ్డిని అజ్ఞాతంలో ఉంచి చిత్ర హింసలకు గురి చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులతో అణచివేయాలని చూస్తే వెనుదిరిగే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బలిజలను, కాపులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాపులను పవన్ కల్యాణ్ మోసం చేసినట్లేనని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.






