- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరిహరవీరమల్లు ఎందుకు రిలీజ్ కాలేదు.. పవన్‌కు అంబటి కౌంటర్
గత ప్రభుత్వంలో హరిహరవీరమల్లు విడుదల కాకుండా ఆపుతున్నారని పవన్ కల్యాణ్ ఆందోళన చేశారని మరి ఇప్పుడు ఎందుకు సినిమా రిలీజ్ కావడంలేదని మాజీ మంత్రి అంబటి ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వంలో హరిహరవీరమల్లు విడుదల కాకుండా ఆపుతున్నారని పవన్ కల్యాణ్ ఆందోళన చేశారని మరి ఇప్పుడు ఎందుకు సినిమా రిలీజ్ కావడంలేదని మాజీ మంత్రి అంబటి ప్రశ్నించారు. అసలు ఆ సినిమానే విడుదల కావడం లేదని అన్నారు. విడుదల తేదీనే మార్చేశారని వ్యాఖ్యానించారు. రిలీజ్ ఆపేస్తారా థియేటర్లలో సినిమా రాకుండా స్ట్రైక్ చేస్తున్నారని ఆరోపించారన్నారు. పవన్ దానిపై విచారణ జరిపిస్తా అన్నారని.. మరి ఎందుకు జరిపించలేదని అడిగారు. సినిమా ఫీల్డ్‌లో వ్యతిరేకంగా ఉన్నవాళ్ల థియేటర్లలో తనిఖీలు చేశారని ఏం పట్టుకున్నారని ప్రశ్నించారు. మళ్లీ దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఊరికే ఆవేశంగా ఎవరో రాసిచ్చింది చదువడం తప్ప ఏపీలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అని విమర్శించారు. పవన్ మంత్రిగా ఉన్న శాఖలోనే పనికి ఆహార పథకం కింద రావాల్సిన డబ్బులు రాలేదన్నారు. అసలు ఎప్పుడైనా డబ్బులు రాకుండా ఉన్నాయా అని ప్రశ్నించారు. నీ శాఖను నువ్వే పట్టించుకోవు అంటూ విమర్శలు కురిపించారు.






