- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష తీర్చకుంటున్నారు: అంబటి
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పెద్దిరెడ్డి కుటుంబంపై టీడీపీ కక్ష తీర్చుకుంటున్నారని విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పెద్దిరెడ్డి కుటుంబంపై టీడీపీ కక్ష తీర్చుకుంటున్నారని విమర్శించారు. క్షక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే కేసును క్రియేట్ చేసి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిందన్నారు. జగన్‌కు సన్నిహితంగా ఉంటున్నారనే కేసులు పెట్టి ఆయనను వేధిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.
జగన్ కన్నా అభివృద్ది చేస్తారని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని కానీ అవన్నీ పక్కన పెట్టి వైసీపీని ఏ విధంగా నాశనం చేయాలనే ఏకైక ధృక్పథంతోనే పనిచేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు, సానుభూతి పరులపై అక్రమ కేసులు పెట్టేందుకే పోలీస్ శాఖ పనిచేస్తుందని మండిపడ్డారు. అన్నీ తప్పుడు కేసులే అని విమర్శించారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టి అణిచివేయాలనే ప్రయత్నం జరుగుతుదన్నారు. చంద్రబాబు, లోకేష్‌లకు ఎవరితో గొడవలు ఉన్నాయో వారందిరినీ లిక్కర్ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు.






