చంద్రబాబు పెద్ద క్రెడిట్ చోర్.. మాజీ మంత్రి అంబటి ఫైర్

by Ajay Maddhiboyina |

చంద్రబాబు పెద్ద క్రెడిట్ చోర్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప‌నిచేసేది ఒక‌రు అయితే క్రెడిట్ పొందేది ఒక‌ర‌ని విమ‌ర్శించారు.

చంద్రబాబు పెద్ద క్రెడిట్ చోర్.. మాజీ మంత్రి అంబటి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు పెద్ద క్రెడిట్ చోర్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప‌నిచేసేది ఒక‌రు అయితే క్రెడిట్ పొందేది ఒక‌ర‌ని విమ‌ర్శించారు. కుప్పంకు మాజీ సీఎం జ‌గ‌న్ 2024 ఫిబ్ర‌వ‌రి 26 హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చార‌న్నారు. అప్పుడు జ‌గ‌న్ నీళ్లు ఇస్తే చంద్ర‌బాబు త‌న వ‌ల్లే నీళ్లు వ‌చ్చాయ‌ని చంద్ర‌బాబు ఇప్పుడు చెప్పుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. ఇరిగేష‌న్ శాఖ మంత్రిగా తాను కూడా జ‌గ‌న్ హంద్రీనివా ద్వారా కుప్పానికి నీళ్లు ఇచ్చిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాన‌ని చెప్పారు.

పోల‌వ‌రం మీద చ‌ర్చ‌కు సిద్దంగా ఉన్నామ‌ని అన్నారు. పోల‌వ‌రం డ‌యాఫ్రం మీ వ‌ల్ల పోయిందా, మా వ‌ల్ల పోయిందా అనేదానిపై చ‌ర్చ‌కు సిద్ద‌మ‌ని చెప్పారు. డబ్బులు కాజేయాల‌నే ఉద్దేశంతో పోల‌వ‌రాన్ని నాశ‌నం చేశార‌న్నారు. దానిని బాగు చేయాలంటే ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన నిపుణులు వ‌చ్చినా దానిని స‌రిచేయ‌లేర‌ని విమ‌ర్శించారు. కాఫ‌ర్ డ్యాములు రెండు కూడా 2018లో ప్రారంభించార‌న్నారు. వాటి ప‌నిచేసే కాలం మూడేళ్లే అన్నారు. డ‌యాఫ్రం వాల్ నిర్మించిన త‌ర‌వాత వాటిని మూసివేయాల‌ని అన్నారు. వాటిని మూసివేస్తేనే జ‌ల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌వ‌చ్చ‌న్నారు.

Next Story