రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ఫైర్.. అప్పుడు కుప్పంలో ఉప ఎన్నికలు వచ్చాయా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-06 17:06:44  IST  )

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ఫైర్.. అప్పుడు కుప్పంలో ఉప ఎన్నికలు వచ్చాయా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (AP Assembly Sessions) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghurama Krishna Raju).. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

గతంలో సీనియర్ ఎన్టీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తానని ప్రతిజ్ఞ చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత సీఎంగా చంద్రబాబు (CM Chandrababu Naidu) ఓడిపోయినపుడు.. అసెంబ్లీకి రానంటూ ఏడుస్తూ వెళ్లారని, అప్పుడు కుప్పంలో ఉపఎన్నిక జరిగిందా? అని ప్రశ్నించారు. జగన్ అంటే ప్రభుత్వంలో భయం కనిపిస్తోందని, అందుకే ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Next Story