- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రానున్న కాలంలో కూటమి కుప్పకూలుతుంది : అంబటి కుమార్తె మౌనిక
త్వరలో కూటమి కుప్పకూలిపోతుందని అంబటి కుమార్తె మౌనిక సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ambati Daughter Mounika Reacts After Her Father Release From Jail
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ పై అంబటి కుమార్తె మౌనిక వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలో కూటమి కుప్పకూలిపోతుందటూ హాట్ కామెంట్స్ చేశారు అంబటి కుమార్తె మౌనిక. తన తండ్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మీడియాను అడ్రస్ చేశారు అంబటి రాంబాబు కుమార్తె మౌనిక.
మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు మౌనిక. ఒక ప్రతికూల పరిస్థితి నుంచి ఎదిగిన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. ఈ రోజు ప్రతి కార్యకర్త, నాయకుడు ఆయనను స్పూర్తిగా తీసుకునేలా కూటమి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒక్క జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి అంత మంది కలిశారని చురకలు అంటించారు.
అయితే, వైసీపీ శ్రేణులు ఏకమైతే మాత్రం త్వరలోనే కూటమి కుప్పకూలిపోతుందని హెచ్చరించారు అంబటి కుమార్తె మౌనిక. ప్రాణాల మీదకు వచ్చిన సరే ఒక్క మాట అంటే జైల్ కు పంపించారని ఆగ్రహించారు. దాడులు, తిట్టిన వారికి పదవులు ఇస్తున్నారని..ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఫైర్ అయ్యారు. ప్రజా బలం, దైవ బలం కలిసి..మీ చుట్టూ ఉచ్చులాగా బిగిస్తుందని హెచ్చరించారు అంబటి మౌనిక. ఇక అటు అంబటి రాంబాబు (Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ నాయకత్వంలో కూటమిని కూల్చే వరకు..నా పోరాటం ఆగదని పేర్కొన్నారు. జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశానని ప్రకటించారు. క్లిక్






