- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు లంచ్ మోషన్ పిటిషన్
సీఎం చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో అరెస్టైన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో అరెస్టైన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఇప్పటి వరకూ ఫైల్ అయిన కేసులన్నింటినీ కొట్టివేయాలని కోరుతూ అంబటి రాంబాబు తరఫు లాయర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు మధ్యాహ్నం విచారించనుంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో అంబటి రాంబాబుపై 52 కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి, అనపర్తి, చిత్తూరు, బాపట్ల సహా వివిధ ప్రాంతాల్లో సీఎంను దూషించడంతో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటినీ కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది.
గతేడాది నంబర్ 12న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ఆయన ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు అడ్డుకోగా.. అంబటి రాంబాబు వారికి ఎదురుతిరిగారు. విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురంలో కేసు నమోదైంది. దీనిపై పీటీ వారెంట్ వేయగా.. నేడు అంబటి రాంబాబును పోలీసులు రాజమండ్రి నుంచి గుంటూరుకు తరలించి కోర్టులో హాజరు పరచనున్నారు.






