- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమైన అమరావతి.. భారీగా ఏర్పాట్లు
రిపబ్లిక్ డే వేడుకలకు తొలిసారిగా అమరావతి సిద్ధమైంది..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో రిపబ్లిక్ డే వేడుకలు(Republic Day Celebrations) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులోని పరేడ్ గ్రౌండ్‌లో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే గణతంత్ర దినోత్సవ వేడుకల ఫైనల్ రిహార్సల్స్‌ను పూర్తి చేశారు. ఈ రిహార్సల్స్‌లో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ సైతం పాల్గొన్నారు. ఈ పరేడ్‌లో వివిధ శాఖల శకటాలు కూడా పాల్గొన్నాయి. తొలిసారిగా నవ్యాంధ్ర రాజధానిలో రిపబ్లిక్ డే వేడకలు నిర్వహిస్తుండటంతో కార్యక్రమంపై భారీగా అంచనాలున్నాయి. దీంతో వేడుకల్లో మొత్తం 13 వేలమంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. 22 ఎకరాల్లో వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మరో రెండు రోజుల్లో కార్యక్రమం నిర్వహించనుండటంతో అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉంది. అటు పోలీసులు సైతం ఈ వేడుకలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. దీంతో ఏర్పాట్లు భారీగా చేశారు. ఈ రోజు సాయంత్రంకల్లా సర్వం సిద్ధం చేయనున్నారు.






