- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతి అంటే హైదరాబాద్ ప్లస్ : సీఎం చంద్రబాబు
అమరావతి అంటే హైదరాబాద్ కు మరో లెవల్ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ను మించిన నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని, అమరావతి అంటే హైదరాబాద్ ప్లస్ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి పార్టీ ఆఫీసులో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలుగు జాతీ ఆత్మగౌరవ నినాదంతో పుట్టినపార్టీ టీడీపీ అని తెలిపారు. రాజధాని విషయంలో ఇకపై మూడు ముక్కలాట ఉండదని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతి వ్యతిరేక శక్తుల్ని ఇక్కడకు రాకుండా చేయాలన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల జీవితాల్లో చాలా మార్పు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కేవలం విజయాలే కాకుండా.. ఎన్నో సవాళ్లు, సంక్షోభాలను కూడా చూశామన్నారు. ఎంతోమంది కార్యకర్తలు తమ ఆస్తులను సైతం పోగొట్టుకున్నారని, ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఎవరెన్ని చేసినా టీడీపీని ఏమీ చేయలేకపోయారని, మున్ముందు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఏమీ చేయలేరన్నారు. పార్టీకోసం ప్రాణాలు అర్పించినవారి పిల్లల కోసం పాఠశాలలు పెట్టామన్నారు. హత్యలు, అరెస్టులు, అణచివేతలు, ఏవీ మనల్ని అడ్డుకోలేవన్నారు. పార్టీకోసం సమర్థవంతంగా పనిచేస్తే కార్యకర్తలు గుర్తింపు ఉంటుందన్నారు. ఎన్నికలు ఏవైనా.. గెలుపు టీడీపీదే అవ్వాలన్నారు. వైకుంఠపాళి రాజకీయాలు ఇటు పార్టీకి, అటు రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తాయన్నారు. పార్టీకోసం ఎనలేని కృషి చేసిన పలువురు కార్యకర్తలను సీఎం ఈ సభలో సత్కరించారు.






