- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో గుడ్ న్యూస్.. 28న బ్యాంక్ భవనాలకు శంకుస్థాపన
మరో కీలక ఘట్టానికి అమరావతి వేదిక కాబోతోంది...

దిశ, వెబ్ డెస్క్: మరో కీలక ఘట్టానికి అమరావతి(Amaravati) వేదిక కాబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజధాని(Ap Capital) అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ఒక్కొక్కటిగా పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఇటీవలే సీఆర్డీఏ(CRDA) భవన కార్యకలాపాలను ప్రారంభించారు. తాజాగా మరో ప్రతిష్టాత్మక భవనాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే సంస్థలకు భూములు సైతం కేటాయించారు. అలాగే ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి.
ఇప్పటికే వివిధ బ్యాంకులకు CRDA భూకేటాయింపులు జరిపింది. ఈ నేపథ్యంలో అమరావతిలో బ్యాంకు భవనాల ఏర్పాటుకు కృషి చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 28న అమరావతిలో బ్యాంకు భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Union Minister Nirmala Sitharaman) చేతులుమీదుగా ప్రారంభించనున్నారు. అనంతరం CRDA ప్రధాన కార్యాలయం దగ్గర జరిగే సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఆమె హాజరుకాకున్నారు. ప్రజలనుద్దేశించి అమరావతి అభివృద్ధిపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించనున్నారు. ఈ మేరకే రాష్ట్ర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.






