కావాలనే దుష్ప్రచారం.. మూడేళ్లలో అంతా పూర్తి చేస్తాం.. : మంత్రి నారాయణ

by Naga Rani Yarlagadda |

ఏపీ రాజధాని నగరం అమరావతి (Amaravati) నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని వైసీపీ నేతలు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని, ఆ ప్రచారాలను నమ్మొద్దని మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు.

కావాలనే దుష్ప్రచారం.. మూడేళ్లలో అంతా పూర్తి చేస్తాం.. : మంత్రి నారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజధాని నగరం అమరావతి (Amaravati) నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని వైసీపీ నేతలు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని, ఆ ప్రచారాలను నమ్మొద్దని మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు. శుక్రవారం ఆయన రాజధానిలో పర్యటించి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను, నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల పనులను పరిశీలించారు. అలాగే గ్రూప్ -డి అధికారుల నివాసాలు, హ్యాపీనెస్ట్ టవర్ల వద్ద పనులు జరుగుతోన్న తీరుపై కూడా ఆరా తీశారు. క్వార్టర్స్, ఇతర భవనాల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు.

అమరావతి ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను మూడేళ్లలో వందశాతం పూర్తిచేస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి 4 వేల ఫ్లాట్ల నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందని తెలిపారు. అలాగే రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ లోనూ వర్షాలు తగ్గిన అనంతరం మౌలిక వసతుల పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సింగపూర్ అధికారుల్ని వేధించడంతో వైరికి రాష్ట్రానికి మధ్యనున్న సత్సంబంధాలు దెబ్బతిన్నాయని, సీఎం సింగపూర్ పర్యటనలో ఆ బంధాలను మళ్లీ పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తామని చెప్పుకొచ్చారు.

Next Story