- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amaravathi : అమరావతి అందరిదీ.. ఏపీకి ఆత్మ అది
రాజధాని అమరావతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఏపీకి ఆత్మవంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

మంచి నగరం ఉంటే ఆదాయం పెరుగుతుంది
ప్రధాని మోడీ పర్యటన విజయవంతం చేద్దాం
త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు
ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
దిశ, డైనమిక్ బ్యూరో: రాజధాని (Rajadhani) అమరావతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఏపీకి ఆత్మవంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఏపీ పర్యటనపై ఎన్డీఏ నేతలతో ఆయన ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు గర్వంగా చెప్పుకోవడానికి రాజధాని ఉండాలన్నారు. మనకు కూడా మంచి నగరం ఉంటే రాష్ట్రానికి సమృద్ధిగా ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. అందుకే అమరావతిని నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని, రోడ్ల నిర్మాణం జరిగితే రవాణా సౌకర్యం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. అయితే ప్రజల్ని తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాజధాని పనుల పున:ప్రారంభానికి మే 2న వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి (Narendra Modi) ఘన స్వాగతం పలికి, సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీఏ విధానం కాబట్టే 2014 నుంచి కేంద్ర విద్యా సంస్థలు ఉత్తరాంధ్ర, కోస్తా, సీమ జిల్లాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు.
వచ్చే నెలలో రైతులకు పెట్టుబడి సాయం
మనం ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు చేస్తున్న మంచి పనులను గురించి వివరించాలని చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత తీసుకుని ప్రజలకు తెలియజేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ మెందుకెళ్తున్నామన్నారు. పోలవరానికి నిధులు, విశాఖ రైల్వేజోన్ మంజూరు, స్టీల్ ప్లాంట్‌కు రూ.11,400 కేంద్రం కేటాయించిందని తెలిపారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే మత్య్సకారుల సేవలో, ఎస్సీ వర్గీకరణ, అన్నక్యాంటీన్లు, పింఛన్లు, 3 గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించారు. వచ్చే నెల రైతులకు అన్నదాత కింద పెట్టుబడి సాయం అందిస్తామని వెల్లడించారు.
లాజిస్టిక్ హబ్‌గా రాయలసీమ
త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 175 నియోజకవర్గాల్లోనూ రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి, వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ సాకారం దిశగా అడుగులు వేస్తామన్నారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని తెలిపారు. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఎరైన్-కో రామాయపట్నంలో, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ దిగ్గజ కంపెనీలు లక్ష కోట్లతో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. రాయలసీమను డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటో మొబైల్స్, డ్రోన్, శాటిలైట్ లాంచింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రాయలసీమకు బెంగళూరు, హైదరాబాద్ అనుసంధాన హైవేలు, ఎయిర్ పోర్టులు ఉండడం ద్వారా లాజిస్టిక్ హబ్‌గా మారుతుందని చంద్రబాబు తెలిపారు. టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు






