Amaravati: ప్రధాని రాకతో అమరావతి మురిసే.. ప్రజల్లో ఆనందం వెల్లివిరిసే

by Kema Shiva Kumar |

పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి అమరావతి (Amaravati) అంగరంగ వైభవంగా ముస్తాబైంది.

Amaravati: ప్రధాని రాకతో అమరావతి మురిసే.. ప్రజల్లో ఆనందం వెల్లివిరిసే
X

దిశ, వెబ్‌డెస్క్: పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి అమరావతి (Amaravati) అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) రాజధాని పనులకు తన చేతుల మీదుగా అంకురార్పణ చేయనున్నారు. ఈ మేరకు అమరావతి పరిధిలో ఆయన రూ.58 వేల కోట్లకు పైగా పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే, రాజధాని పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం 20 అడుగుల ఎత్తైన పైలాన్‌ను ఏర్పాటు చేయగా.. దానిని ప్రధాని ఆవిష్కరించనున్నారు. తాడికొండ (Thatikonda) నుంచి వెలగపూడి (Velagapudi) వరకు రాజధాని రైతులు ర్యాలీ చేపట్టనున్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా సభలో ఐదు గ్యాలరీలను ఏర్పాటు చేశారు.

5 లక్షల మందితో అట్టహాసంగా బహిరంగ సభ

ఈ సందర్భంగా నిర్వహించే సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 8 వేల బస్సులు, 5 వేలకు పైగా కార్లలో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు తరలిరానున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వారికి ఎలాంటి ఇబ్బందుకు కలుగుకుండా ట్రాన్స్‌పోర్ట్, భోజనం, పార్కింగ్‌ ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ప్రధాని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించే ఎస్పీజీ (SPG) తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక ప్రధాన వేదికపై కేవలం 14 మందినే అనుమతించనున్నారు. అందులో ప్రధాని మోదీతో పాటు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (Governor Justice Abdul Nazeer), సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ (Deputy CM Pavan Kalyan), మంత్రి లోకేశ్‌ (Minister Lokesh)తో పాటు కేంద్ర మంత్రులు ఉన్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని

షెడ్యూల్‌లో భాగంగా కేరళ (Kerala) రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న విజింజం పోర్టును ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) జాతికి అకితం చేయనున్నారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి నేరుగా అమరావతి (Amaravati) పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సరిగ్గా మధ్యాహ్నం 2.55కు గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport)కు చేరుకుంటారు. అక్కడ మంత్రులతో పాటు కూటమి నేతలు ఆయనకు ఘన స్వాగతం పలివిన తర్వాత హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌‌ (Deputy CM Pavan Kalyan) ఆయనకు స్వాగతం పలికిన వెంటనే అమరావతి పునర్నిర్మాణానికి సూచికగా నిర్మించిన 20 అడుగుల ఎత్తైన పైలాన్‌‌ (Pylon)ను ఆవిష్కరిస్తారు. బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించి సాయంత్రం 4.55కు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

ప్రధాని చేతుల మీదుగా రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులు శ్రీకారం

అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఏకంగా రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. అందులో ముందుగా రాజధాని అమరావతి (Amaravati)లో చేపట్టే రూ.49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా హైకోర్టు (High Court), సెక్రటేరియట్ (Secretariat), అసెంబ్లీ (Assembly) భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయ నిర్మాణాలకు ఇనాగ్యురేట్ చేయనున్నారు. ఇక డీఆర్‌డీవో (DRDO), డీపీఐఐటీ (DPIIT), ఎన్‌హెచ్‌ఐ (NHI), రైల్వేస్‌కు సంబంధించి రూ.57,962 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

అదేవిధంగా నాగాయలంక (Nagaya Lanka)లో దాదాపు రూ.1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్‌ (Missile Test Range)కు, వైజాగ్‌ (Vizag)లో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్‌ (Unity Mall)కు, రూ.293 కోట్లతో గుంతకల్ వెస్ట్ (Guthakallu West) నుంచి మల్లప్పగేట్ (Mallappa Gate) వరకు చేపట్టిన రైల్వే ప్రాజక్టుకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా రూ.3,176 కోట్ల మేర నేషనల్ హైవే ప్రాజెక్టు (National Highway Project)ల ప్రారంభోత్సవంలో అమరావతి వేదికగా వర్చ్యువల్ పాల్గొంటారు. రూ.254 కోట్లతో పూర్తి చేసిన ఖాజీపేట - విజయవాడ 3వ లైన్, గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి, KUF పాణ్యం లైన్లను ఆయన ప్రారంభించనున్నారు.

Next Story