- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆలూరి సాంబ శివారెడ్డి
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆలూరి సాంబ శివారెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి జైలులో ఉండటంతో ఆయన వచ్చే వరకు తాత్కాలికంగా

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆలూరి సాంబ శివారెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి జైలులో ఉండటంతో ఆయన వచ్చే వరకు తాత్కాలికంగా పార్టీ అనుబంధ విభాగాల వ్యవహారాలను ఆలూరి పర్యవేక్షించనున్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ అక్రమ కేసు కారణంగా అరెస్ట్ అయిన చెవిరెడ్డి బయటకు వచ్చేవరకు సాంబ శివారెడ్డి కొనసాగుతారని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కాం కేసులో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న ఆయన మూడు రోజుల సిట్ విచారణకు సైతం హాజరయ్యారు. విచారణలో అవినీతి జరిగినట్టు రుజువైతే ఆయనకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.






