Alluri Sitharamaraju : భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు ప్రతిపాదన

by Muthe.Rajitha |

ఏపీ శాసనసభలో మంత్రి బీసీ జనార్ధనరెడ్డి కీలక ప్రతిపాదన చేశారు.

Alluri Sitharamaraju : భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు ప్రతిపాదన
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ శాసనసభలో మంత్రి బీసీ జనార్ధనరెడ్డి కీలక ప్రతిపాదన చేశారు. భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు((Bhogapuram International Airport)కు అల్లూరి సీతారామరాజు(Alluri Sitharamaraju) పేరును ప్రతిపాదించారు. గిరిజనుల పక్షాన బ్రిటీషర్స్ తో పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు పేరును ఎయిర్పోర్టుకు పెట్టడం వలన తెలుగు ప్రజల తరపున ఆయనకు సముచిత గౌరవం అందించినట్టు ఉంటుందని తెలిపారు. కాగా ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Next Story