- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన.. రిటైర్డ్ ఐపీఎస్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశం
గతేడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో సినీ హీరో అల్లు అర్జున్.. నంద్యాల వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవిచంద్రారెడ్డి (Shilpa Ravichandra Reddy)ని కలిసేందుకు వెళ్లిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో సినీ హీరో అల్లు అర్జున్.. నంద్యాల వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవిచంద్రారెడ్డి (Shilpa Ravichandra Reddy)ని కలిసేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) రాకతో అభిమానులు భారీగా తరలిరావడంతో ఎన్నికల కోడ్ (Election Code)ను ఉల్లంఘించారంటూ పోలీస్ కేసు నమోదైంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ పర్యటన, భారీ ర్యాలీకి అనుమతించారని ఐపీఎస్ అధికారి రఘువీర్ పై అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన రఘువీర్‌పై విచారణ జరపాలని ఆదేశిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఒక విచారణ అధికారిని నియమించింది.
ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణను విచారణ అధికారిగా, అనంతపురం డీఐజీగా పనిచేస్తున్న షిమునిని ప్రజెంటింగ్ అధికారిగా నియమిస్త సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. అల్లు అర్జున్ పర్యటన, ర్యాలీపై రఘువీర్ పై వచ్చిన అభియోగాలపై సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎస్ ఆదేశాల్లో పేర్కొన్నారు.






