‘ఆ అంశం పై వివరణ ఇవ్వాలి’.. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-10 12:16:50  IST  )

టాలీవుడు హీరో(Tollywood Hero) అల్లు అర్జున్(Allu Arjun) మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Chandra Shekhar Reddy) తాజాగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

‘ఆ అంశం పై వివరణ ఇవ్వాలి’.. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ
X

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడు హీరో(Tollywood Hero) అల్లు అర్జున్(Allu Arjun) మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Chandra Shekhar Reddy) తాజాగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీంతో పార్క్ చుట్టూ ఉన్న ఆరు కూడళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో.. రూ. 1,100 కోట్లను కేటాయించింది.

ఈ క్రమంలో హైదరాబాద్(Hyderabad) బంజారాహిల్స్(Banjara Hills) లోని కేబీఆర్ పార్క్(KBR Park) వద్ద రహదారి విస్తరణ పనులకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun) మామ చంద్రశేఖర్ రెడ్డికి చెందిన ఇంటి స్థలానికి అధికారులు మార్కింగ్ వేశారు. ఈ నేపథ్యంలో గ్రీన్ లాండ్స్‌లోని మహాత్మ జ్యోతిరావు పూలే భవన్(Mahatma Jyoti Rao Phule Bhavan) నిర్వహిస్తున్న ప్రజావాణి(Prajavani)లో ఆయన ఫిర్యాదు చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా తన ఫ్లాట్‌లో ఓ వైపు 20 అడుగులు, మరోవైపు 36 అడుగుల భూమిని సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను ఆయన కోరారు.

Next Story