రాజధాని రైతులకు పెండింగ్ ప్లాట్ల కేటాయింపు ప్రారంభం

by Thanuru Gopichand |

పారదర్శకత కోసం ఈ-లాటరీ విధానం అవలంబిస్తున్న అధికారులు.

రాజధాని రైతులకు పెండింగ్ ప్లాట్ల కేటాయింపు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి (Amaravati Capital) నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు (Farmers) ఎట్టకేలకు పెండింగ్ ప్లాట్ల (Pending Plots) కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. సీఆర్డీఏ కార్యాలయంలో (CRDA Office) ఈ-లాటరీ (E-Lottery) ద్వారా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు నిర్వహిస్తున్నారు. 14 గ్రామాల్లోని 90 మంది రైతులకు 135 ప్లాట్ల కేటాయింపును అధికారులు ప్రారంభించారు. లబ్ధిదారులను లాటరీ పద్ధతి ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ-లాటరీ పద్ధతి పారదర్శకంగా జరిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు.

నిడమర్రులో 58, పిచ్చుకలపాలెంకు 3, అనంతవరంలో ఒకటి, పెనుమాకలో 7, లింగాయపాలెంలో 7, వెలగపూడిలో 25 ప్లాట్లను కేటాయించినట్లు అధికారులకు వెల్లడించారు. మందడంలో 21, మల్కాపురంలో 10, కురగల్లులో 7, నేలపాడులో 2 ప్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఉండవల్లిలో మెట్ట భూములిచ్చిన 201 మంది రైతులకు లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరుపుతామన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా కేటాయింపులు జరిగిన వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడుతున్నామని సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు.

Next Story