- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP : కేంద్ర బడ్జెట్ లో ఏపీకీ కేటాయింపులు
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రానికి సంబంధించి గత హామీల మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) కేటాయింపులు(Budget Allocations)చేశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు బడ్జెట్ లో వెల్లడించారు

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రానికి సంబంధించి గత హామీల మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) కేటాయింపులు(Budget Allocations)చేశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు బడ్జెట్ లో వెల్లడించారు. రూ 30,436 కోట్లకు ఆమోదం తెలుపుతున్నట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు కేటాయించారు. పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు కూడా కేటాయించారు.
అదే విధంగా 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేలా నిర్మాణం చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించారు. అదే విధంగా విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, రైల్వే కనెక్టివిటీలోనూ ఏపీకి కేటాయింపు లు చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇక, బీహార్ కేటాయింపులతో ఏపీకి కేటాయింపుల పైన చర్చ జరుగుతోంది. ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు రూ.186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్ కు మద్దతుగా రూ.375 కోట్లు, రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీ హుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు కేటాయించినట్లుగా తెలిపారు.
వాస్తవానికి కేంద్ర బడ్జెట్ లో ఏపీకి భారీ కేటాయింపులనే సీఎం చంద్రబాబు ఆశించారు. ఏపీకి కావాల్సిన సాయం పైన ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు వినతు లు సమర్పించారు. కేంద్రలో భాగస్వామిగా ఉండటంతో ఏపీకి ప్రాధాన్యత దక్కుతుందనే భావన తో కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఈ ధఫా భారీ కేటాయింపులు ఉంటాయనుకున్నారు. అయితే ఏపీ కంటే కేంద్ర ప్రభుత్వం త్వరలో ఎన్నికలు జరుగాల్సి ఉన్న బీహార్ రాష్ట్రానికి అధిక కేటాయింపులు చేయడం గమనార్హం.






