- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీతో పొత్తు ఫిక్స్.. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పొత్తు ఫిక్స్ అయ్యింది. సుధీర్ఘ భేటీ అనంతరం ఎట్టకేలకు మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పొత్తు ఫిక్స్ అయ్యింది. సుధీర్ఘ భేటీ అనంతరం ఎట్టకేలకు మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు శనివారం మూడు పార్టీల అధ్యక్షులు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలో తిరిగి ఆరేళ్ల తర్వాత జాయిన్ కావడంపై చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ఎన్డీఏ కూటమిలో తిరిగి చేరడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల కేవలం పొత్తు మాత్రమే కాదని.. రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడే భాగస్వామ్య కూటమి అని అన్నారు. ఏపీ ప్రజలు తమకు సేవ చేసేందుకు చారిత్రాత్మకతీర్పుతో అధికారాన్ని అందిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, స్వర్ణయుగానికి కృషి చేస్తామన్నారు. ప్రధాని మోడీతో కలిసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.






