ఏపీలో కూటమి సునామీ..!

by Ramesh N |
ఏపీలో కూటమి సునామీ..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ కూటమి దూసుకెళ్తోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీకి గట్టి పట్టు ఉన్న రాయలసీమలోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. కడప, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగులో టీడీపీ ముందంజలో ఉంది. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ తప్ప మిగతా మంత్రులందరూ వెనుకంజలో ఉన్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రాజమహేంద్రవరం రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంగళగిరిలో నారా లోకేశ్, పూతలపట్టులో మురళీమోహన్ ముందంజలో ఉన్నారు.

పులివెందులలో జగన్మోహన్‌ రెడ్డి లీడ్‌‌లో ఉన్నారు. మరోవైపు విజయవాడ వెస్ట్‌లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముందంజలో ఉన్నారు. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ ముందంజలో ఉన్నారు. హిందూపూర్‌లో బాలకృష్ణ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతానికి ఏపీలో ఎన్డీయే కూటమి 100 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Advertisement

Next Story