TDP కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో CID దూకుడు

by Ajay Maddhiboyina |

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డిని సీఐడీ విచార‌ణ‌కు పిలిచింది. సీఐడీ నోటీసుల మేర‌కు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే

TDP కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో CID దూకుడు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డిని సీఐడీ విచార‌ణ‌కు పిలిచింది. సీఐడీ నోటీసుల మేర‌కు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. ఈ కేసులో 127వ ముద్దాయిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. మ‌రోవైపు రెండు వారాల క్రిత‌మే కేసులో ఏ120గా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని అధికారులు విచారించారు. ఈ కేసులో దోషులుగా ఉన్న మ‌రికొంద‌రు నింధితులు కోర్టు ద్వారా అరెస్టు నుండి ర‌క్ష‌ణ పొందారు.

అయితే వారంద‌రికీ ఇప్పుడు సీఐడీ నోటీసులు జారీ చేసింది. కేసు ద‌ర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖ‌లు చేసేందుకు సిద్ధ‌మైంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు పానుగంటి చైత‌న్య సోమ‌వారం మంగ‌ళ‌గిరి కోర్టులో లొంగిపోయారు. చైత‌న్య వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్నారు. 2021 అక్టోబ‌ర్ 19న మంగ‌ళ‌గిరి టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి జ‌ర‌గ్గా చైత‌న్య ప్ర‌త్యేక్షంగా పాల్గొన్న‌ట్టు సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఇదే కేసులో వైసీపీ నేత‌లు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, త‌ల‌శిల ర‌ఘురాం విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు.

Next Story