- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : టీడీపీలో చేరిన ఆళ్ళ నాని..
వైసీపీ(YCP) చెందిన మరో మాజీ మంత్రి పసుపు కండువా కప్పుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ(YCP) చెందిన మరో మాజీ మంత్రి పసుపు కండువా కప్పుకున్నారు. ఏలూరుకు చెందిన వైసీపీ మాజీ మంత్రి ఆళ్ళ నాని(Alla Nani) గురువారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(AP CM Nara Chandrababu Naidu) సమక్షంలో టీడీపీ(TDP)లో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నానికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉంటూ వచ్చిన ఆళ్ళ నాని.. గతేడాది ఆగస్టులోనే ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎంగా.. వైద్యారోగ్యశాఖ మంత్రిగాను నాని ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చి, ఆగస్టులో పార్టీకి, అన్ని పదవులకు రాజీనామా చేశారు. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.






