Amaravathi : అడుగులన్నీ.. అమరావతికే

by Thanuru Gopichand |

రాష్ట్ర చరిత్రలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది.

Amaravathi : అడుగులన్నీ.. అమరావతికే
X

నేటి సాయంత్రం అమరావతి పున:ప్రారంభానికి శ్రీకారం

రాష్ట్రవాప్తంగా రాజధానికి తరలివస్తున్న ప్రజానీకం

సకల ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం

అమరావతిలో పండుగ వాతావరణం

ర్యాలీలతో హర్షం వక్తం చేస్తున్న రాజధాని ప్రజలు

దిశ, డైనమిక్ ​బ్యూరో : రాష్ట్ర చరిత్రలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఆంధ్రుల ఆశలు, ఆకాంఓలకు కేంద్రంగా అమరావతి పునర్నిర్మణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ వేడకు తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక రవాణా, ఆహార సదుపాయాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలి రానున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి బస్సుకు ఒక ప్రభుత్వ అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. 25 బస్సులకు ఒక ప్రత్యేక ఇన్‌చార్జి అధికారిని ఉంచారు. ఎక్కడా ఆటంకాలు కలగకుండా సభాస్థలికి చేర్చే విధంగా ఏర్పాట్లు చేశారు. బస్సులోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. పలు జిల్లాల నుంచి ఎంతోమంది సొంత కార్లలో అక్కడికి చేరుకుంటున్నారు.

మరో వైపు రాజధాని అమరావతిలో సందడి వాతావరణం నెలకొంది. ఎన్నో ఏళ్ల కల సాకారం కానుండడంతో రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో రైతులు, రైతు కూలీలు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోడీ సభ జరగనున్న నేపధ్యంలో రైతులు ఆకుపచ్చని కండువాలతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ జరిపారు. బాణసంచా కాల్చారు. ప్రధాని సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా స్థానిక లైబ్రరీ సెంటర్ వద్ద ఎన్టీఆర్​విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరిగి అమరావతికి పూర్వ వైభవం వస్తుండడంతో వారు ఆనందోత్సాహలతో నిండిపోయారు.

దూర ప్రాంతాల నుంచి సభకు వస్తున్న వారి సౌకర్యాలను కృష్ణా జిల్లా కలెక్టరేట్​నుంచి మోనిటర్​చేస్తున్నారు. ప్రధాన మంత్రి మోదీ రాకతో గుంటూరు, విజయవాడ నగరాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు జరిగాయి. ఏపీలోని అన్ని మండలాల నుంచి ఎన్ని బస్సులు బయలుదేరాయని, వచ్చిన వారికి భోజన సౌకర్యాలు, పార్కింగ్ ఫెసిలిటీలు కలెక్టర్​ లక్ష్మీశా కల్పిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి కూడా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి జనం తరలివెళ్తున్నారు. భీమవరం పాత బస్టాండ్‌లో జనం తరలి వెళ్తున్న బస్సులను జిల్లా కలెక్టర్ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో 150 బస్సుల్లో సుమారు 8000 మంది అమరావతి తరలివెళ్తున్నారు.

Next Story