Kakinada: కాపు నేతల కీలక నిర్ణయం.. ఇక నుంచి దూకుడేనా..?

by Vemula.Srinu Prasad |

తెలుగుదేశం పార్టీలో కాపు నేతలంతా ఒకే తాటిపైకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.....

Kakinada: కాపు నేతల కీలక నిర్ణయం.. ఇక నుంచి దూకుడేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో కాపు నేతలంతా ఒకే తాటిపైకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ బలోపేతంపై ప్రధాన పాత్ర వహించాలని నిర్ణయించుకున్నారు. కాపులు ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో మరింత బలోపేతం అయ్యేందుకు యత్నిస్తున్నారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పథకాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నేతలతో సమావేశాలు నిర్వహించే యోచన చేస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు నేతలతో వంగవీటి రాధా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, కాపు నేతల మధ్య సమన్వయంపై చర్చిస్తున్నారు. కాపునేతలంతా కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, వచ్చే ఎన్నికల్లో కాపులు ప్రాబల్యం ఉన్న అన్ని నియోజకవర్గాల్లో గెలిపించాలని నిర్ణయించారు.

Next Story