- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రాభివృద్ధిలో తెలుగువారంతా భాగస్వాములు కావాలి: మంత్రి నారా లోకేష్
గత ఐదేళ్ల విధ్వంస పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్చందంగా ముందుకు వచ్చారు.

దిశ, ఏపీ బ్యూరో / సింగపూర్: గత ఐదేళ్ల విధ్వంస పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్చందంగా ముందుకు వచ్చారు. అందుకే ఏ దేశం వెళ్లినా ముఖ్యమంత్రి, నేను తొలుత తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో లోకేష్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇక్కడ ఉన్న తెలుగు వారంతా రాష్ట్రాభివృద్ధి లో భాగస్వాములు కావాలి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలి. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్రం ఊపిరి తీసుకుంటోంది. ప్రధాని మోడీజీ త్వరలోనే సింగపూర్ లో పర్యటిస్తారు. ఆ పర్యటనలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొని విజయవంతం చేయండి. రాష్ట్రానికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లను అభినందించిన లోకేష్ వారితో ఫోటోలు దిగారు.






