- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విష్ణుప్రియపై క్రిమినల్ కేసు పెట్టాలి : AISF డిమాండ్
యాంకర్ విష్ణుప్రియపై AISF పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా అర్ధనగ్న వీడియోలు చేస్తోందని మండిపడింది.

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ భీమినేనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) నాయకులు డిమాండ్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో డబ్బులకోసం అర్థనగ్న వీడియోలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు విజయవాడ సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. ఈ సందర్భంగా విష్ణుప్రియ మాట్లాడుతూ.. తన ఇన్ స్టాగ్రామ్ లో అర్ధనగ్న వీడియోలు చూడాలంటే నగదు చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకోవాలని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సెలబ్రిటీ హోదాలో ఉండి.. కేవలం డబ్బుకోసం ఇలాంటి అసభ్యకర వీడియోలను ప్రోత్సహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. సమాజానికి, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే విష్ణుప్రియ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను బ్లాక్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని AISF నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.






