- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ ప్రారంభం
ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్-2 మంగళగిరిలోని ఆరో పోలీస్ బెటాలియన్‌లో సోమవారం ప్రారంభంకానుంది. ముఖ్య

దిశ, ఏపీ బ్యూరో : ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్-2 మంగళగిరిలోని ఆరో పోలీస్ బెటాలియన్‌లో సోమవారం ప్రారంభంకానుంది. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత, గౌరవ అతిథిగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరుకానున్నారు. ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 17 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, న్యూ ఢిల్లీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నట్లు డీజీపీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ జాతీయ స్థాయి క్రీడా సమ్మేళనంలో వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, యోగా విభాగాల్లో పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. వీటిని అమరావతిలోని విట్ క్యాంపస్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సీపీఓల నుండి వచ్చిన వివిధ పోలీస్ శాఖలకు చెందిన 32 జట్లు, మొత్తం 1010 మంది క్రీడాకారులు ఈ క్లస్టర్‌లో పాల్గొంటున్నారు. సహాయక సిబ్బందితో కలిపి సుమారు 1500 మంది సభ్యులు ఈ మహోత్సవానికి హాజరవుతున్నారు. గత ఏడాది మొదటి ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు భిలాయ్‌లో నిర్వహించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.






