- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. దీనికి సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు భక్తులకు కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ కోటాను రేపు(శుక్రవారం) విడుదల చేయనుంది. జనవరి 2 నుంచి 8 వరకు టికెట్లను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో ఉంచుతారు. శ్రీవాణి ట్రస్ట్ దాతల కోటాను అదే రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ..
వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు.
పది రోజుల పాటు తిరుపతిలో సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత
వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయడం జరుగుతుంది.






