Heavy Rain Alert:రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది.

Heavy Rain Alert:రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు(Rains) కురుస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రాబోతున్నాయని IMD పేర్కొన్న సంగతి తెలిసిందే.

దీని ప్రభావంతో ఏపీ(Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో ఈరోజు(గురువారం), రేపు(శుక్రవారం) అతి భారీ వర్షాలు(Heavy Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological department) తాజాగా వెల్లడించింది. ఉత్తర కర్ణాటక - గోవా తీరాల నుంచి కోస్తాంధ్ర వరకు.. సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(APSDMA) రోణంకి కూర్మనాథ్(Ronanki Kurmanath) వెల్లడించారు.

ఈ తరుణంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇవాళ(గురువారం) ఏపీలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

రేపు(శుక్రవారం) అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా.

ఈ క్రమంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గంటకు 40 నుంచి 50 కి మీ వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Next Story