- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Janasena:రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. జనసేన పార్టీ కీలక ప్రకటన
ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు గతంలో జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు గతంలో జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వివిధ రకాల సమస్యలతో జనవాణికి వచ్చిన ప్రజలను జనసేనాని పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకుని పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా జనసేన పార్టీ(Janasena Party) జనవాణి కార్యక్రమం నిర్వహణ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ తరుణంలో అర్జీదారుల సౌకర్యార్థం వాతావరణంలో ఎండ తీవ్రత వల్ల జనవాణి(Janavani) పని వేళల్లో మార్పు చేయడం జరిగిందని జనసేన పార్టీ వెల్లడించింది.
కొత్త పని వేళలు
సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9:30 గం. నుంచి మధ్యాహ్నం 12:30 గం. వరకు.. కొనసాగింపుగా సాయంత్రం 4:30 గం. నుంచి 5:30 గం. వరకు నిర్వహిస్తారు. ఈ కొత్త సమయములు నేటి(21-04-2025) నుంచి అమలులోకి వస్తున్నందున అందుకు అనుగుణంగా జనసేన జనవాణి సేవలు వినియోగించు కోవాల్సిందిగా కోరారు. ఈ మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.






