- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!
తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 29 నాటికి.. అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 29 నాటికి.. అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆగస్టు 31 వరకు నార్త్ కోస్టల్ ఏపీలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం తో పాటు పొరుగున ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో వ్యాపించి, దక్షిణం వైపుకు వంగి ఉంది. దీని ప్రభావం వలన తూర్పు మధ్య బంగాళాఖాతం, ఇంకా దానిని ఆనుకొని ఉన్న ఉత్తర భాగంలో ఆగస్టు 29 నాటికీ.. అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాబోయే మూడు రోజుల్లో...
- ఉత్తర కోస్తా ఏపీ, యానాంలలో..
బుధవారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి.
గురువారం: చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా ఉరుములతో కూడిన జల్లులు, ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శుక్రవారం: ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
- దక్షిణ కోస్తా ఏపీ లో..
బుధవారం: గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులతో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.
గురువారం: కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, బలమైన ఉపరితల గాలులు వీస్తాయి.
శుక్రవారం: ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉంది.
- రాయలసీమలో..
బుధవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు ఒకట్రెండు చోట్ల కురుస్తాయి. గురువారం కొన్నిచోట్ల తేలికపాటి చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్లు, అలాగే శుక్రవారం రాయలసీమ ప్రాంతంలో ఉపరితల గాలులు.. గంటకు 30-40 కి.మీ వేగంతో ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.






