విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో మార్పులు.. మోడల్ పేపర్ ఇదే!

by Jakkula.Mamatha |

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో మార్పులు.. మోడల్ పేపర్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) విద్యావ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ సర్వేకు అనుగుణంగా పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. 2026 పబ్లిక్ పరీక్షలకు సంబంధించి బ్లూ ప్రింట్, మోడల్ పేపర్లను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. సృజనాత్మక ప్రశ్నలకు ప్రధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. కానీ.. ప్రశ్నలు, మార్కుల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు.

కొత్త బ్లూప్రింట్‌ ప్రకారం గణితం ప్రశ్నాపత్రంలో నాలెడ్జ్‌కు 20%, అవగాహనకు 25%, అప్లికేషన్‌కు 20%, అనాలసి్‌సకు 15%, ఎవాల్యుయేషన్‌కు 10%, సృజనాత్మకతకు 10% వెయిటేజీ ఇచ్చారు. ఎనిమిది మార్కుల ప్రశ్నలు 5, నాలుగు మార్కుల ప్రశ్నలు 8, రెండు మార్కుల ప్రశ్నలు 8, ఒక మార్కు ప్రశ్నలు 12 ఉంటాయని తెలిపింది. అర్థమెటిక్‌ ప్రశ్నల్లో ఛాయిస్‌ తొలగించారు. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల పనితీరు ఆధారిత అవగాహన పెంచేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలిపింది. అన్ని సబ్జెక్టుల మోడల్ పేపర్లు, వెయిటేజ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story