TTD: భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల పై కీలక అప్డేట్

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-24 02:32:37  IST  )

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు

TTD: భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల పై కీలక అప్డేట్
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు చేరుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో అక్టోబర్ నెలకు సంబంధించిన టీటీడీ విడుదల చేయు ప్రత్యేక దర్శన టికెట్లు వివరాల పై కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే.. అక్టోబర్ నెలకు సంబంధించిన కళ్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, ఊంజల్ సేవ టికెట్లు, అంగప్రదక్షిణ టోకెన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేసేందుకు టీటీడీ సిద్ధమైంది.

తిరుమల తిరుపతి దేవస్థానం అక్టోబర్ 2025 నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ రోజు(గురువారం) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే వసతి గదుల బుకింగ్ కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://www.tirumala.org/ ద్వారా టికెట్లు, గదులకు బుక్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. వర్షాకాలం అయినప్పటికీ భక్తులు ఏమాత్రం ఆలోచించకుండా ఆలయానికి అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు.

Next Story