Alert: మత్స్యకారులకు బిగ్ అలెర్ట్: నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేట నిషేధం

by Kema Shiva Kumar |

కాకినాడ తీరంలో నేటి అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు చేపల వేటపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Alert: మత్స్యకారులకు బిగ్ అలెర్ట్: నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేట నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ తీరంలో చేపల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏటా నిర్వహించే చేపల వేట నిషేధం నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానుంది. జూన్ 14 వరకు అంటే సుమారు 61 రోజుల పాటు ఈ నిషేధం కొనసాగుతుంది. ఈ మేరకు మత్స్యశాఖ (Department of Fisheries) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, ప్రతి ఏటా వేసవి కాలంలో చేపలు, ఇతర సముద్ర జీవులు గుడ్లు పెట్టి పిల్లలను పుట్టించే సమయం ఇది. ఈ సమయంలో వేట సాగిస్తే మత్స్య సంపద అంతరించిపోయే ప్రమాదం ఉన్నందున, శాస్త్రీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది.

నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం..

నిషేధాజ్ఞలను ఎవరైనా అతిక్రమించి సముద్రంలోకి వేటకు వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అందుకు జరిమానా రూ.5 వేలు విధించనున్నారు. అదేవిధంగా వేటకు వాడిన బోటును కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బోటు రిజిస్ట్రేషన్, లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయనున్నారు. వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ‘మత్స్యకార భరోసా’ పథకాన్ని అమలు చేస్తోంది. అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది. కాకినాడ (Kakinada) జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న మత్స్యకారులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది.

Next Story