- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలోని మహిళలకు అలర్ట్.. ఆ బస్సుల్లో ‘ఫ్రీ బస్ జర్నీ’ వర్తించదు!?
రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం పై కీలక అప్డేట్ వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే పలు హామీలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం.. రేపు మహిళకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ తరుణంలో ఏపీలోని మహిళలకు రేపటి నుంచి ఫ్రీ బస్ స్కీం ప్రారంభం కానుంది.
‘స్త్రీ శక్తి’ పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించిన తర్వాతే జీరో ఫేర్ టికెట్ల జారీ మొదలవుతుంది. విజయవాడ పీఎన్ బస్టాండ్‌లో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకానికి ఏపీలో నివాసం ఉంటున్నట్లు ధృవీకరణ ఉన్న బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లు ఉచిత ప్రయాణం చెయ్యొచ్చు. అర్హులైన ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్లు ఇస్తారు. కాగా, నాన్‌స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి(తిరుమల), అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో స్కీమ్ వర్తించదు. అలాగే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మధ్య తిరిగే ఇంటర్ స్టేట్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం కల్పించలేదు.






