తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?

by Jakkula.Mamatha |

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 30 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. ఇక, నిన్న(గురువారం) స్వామిని 61,521 మంది భక్తులు దర్శించుకోగా.. 25,101 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Next Story