- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు చేరుకొని శ్రీవేంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు భక్తుల రద్దీ సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
ఈ క్రమంలో నేడు(మంగళవారం) టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(సోమవారం) శ్రీవారిని 67,767 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,852 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ. 4.07 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.






